డెంగ్యూ దోమను గుర్తించే విధానం ఇదే, మరి మీరూ తెలుసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

వర్షాకాలంలో దోమల సంఖ్య భారీగా పెరుగుతుంది. వాటివల్ల వచ్చే వ్యాధులు సైతం పెరుగుతాయి

Image Source: pexels

దోమలు కుట్టడం వల్ల వచ్చే చాలా ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధి డెంగ్యూ.

Image Source: pexels

అలాంటి సందర్భంలో మీరు డెంగ్యూ దోమను ఎలా గుర్తించాలో తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది

Image Source: pexels

డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే ఆ దోమ రకం పేరు ఏడిస్ ఈజిప్ట్.

Image Source: pexels

వాటి శరీరం, కాళ్ల మీద తెల్లని, నల్లని చారలు ఉంటాయి. దాంతో అవి కంచరగాడిదను పోలి ఉంటాయి

Image Source: pexels

సాధారణ దోమల కంటే ఈ దోమలు కొంచెం చిన్నవిగా, ఆకారంలో సన్నగా ఉంటాయి

Image Source: pexels

ఈ దోమలు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఎక్కువ చురుకుగా ఉంటాయి, అప్పుడే మనల్ని కుడతాయి.

Image Source: pexels

డెంగ్యూ దోమలు శుభ్రమైన, నిల్వ ఉన్న నీటిలో ఉంటాయి. ఉదాహరణకు పూల కుండీలు, పాత టైర్లు, కూలర్లు మొదలైనవి

Image Source: pexels

ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు దోమలు ఎక్కువగా ఉంటే శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం బెటర్

Image Source: pexels