మునగాకులు పచ్చిగా తింటే కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri

మునగ ఆకుల్లో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటంతో హిమోగ్లోబిన్ పెరగడంలో సహాయపడుతుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అజీర్ణం, బద్ధకం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

విటమిన్ A, E ఉండటంతో చర్మం మెరుస్తుంది. జుట్టు బలపడుతుంది.

ఇన్​ఫ్లమేషన్ తగ్గిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటంతో వాపులు తగ్గుతాయి.

చెడుకొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

విటమిన్ A వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

రోజంతా ఎనర్జీగా ఉండటానికి సహాయపడుతుంది.

రోజుకు 5–7 తాజా ఆకులు సరిపోతాయి. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.