తలనొప్పి vs మైగ్రేన్.. ఈ లక్షణాలతో తేడాలు గుర్తించండి

Published by: Geddam Vijaya Madhuri

సాధారణ తలనొప్పి చాలావరకు టెన్షన్ తలనొప్పి ఉంటుంది.

మైగ్రేన్ అనేది మెదడుకు సంబంధించిన ఒక నాడీ సంబంధిత వ్యాధి.

సాధారణ నొప్పి కణతల రెండు వైపులా లేదా నుదుటిలో ఉంటుంది.

రోజువారీ పనులు చేయడం వల్ల సాధారణ తలనొప్పి పెరగదు.

నిద్రలేమి అలసట, ఒత్తిడి సాధారణ నొప్పికి కారణమవుతాయి.

మైగ్రేన్లో కణతలో ఒక వైపు తీవ్రమైన కొట్టుకునేంత నొప్పి వస్తుంది.

ప్రకాశవంతమైన కాంతి, శబ్దం మైగ్రేన్ నొప్పిని పెంచుతాయి.

మైగ్రేన్లో వాంతులు లేదా తలతిరగడం అనే భావన కూడా కలుగుతుంది.

నొప్పి నిరంతరం పెరిగితే న్యూరాలజిస్ట్ సలహా తీసుకోవడం అవసరం.