రాత్రుళ్లు ముఖానికి కలబంద రాసి పడుకుంటే కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri

ఒత్తిడి, కాలుష్యం వల్ల చర్మం కోల్పోయిన మెరుపును తిరిగి ఇవ్వడంలో సహాయపడుతుంది.

అంతేకాకుండా కలబంద చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలకు రామబాణం అవుతుంది.

అందులో విటమిన్ A, C, E, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

రాత్రి పూట అప్లై చేయడం వల్ల పొడి చర్మానికి తగినంత తేమ లభిస్తుంది.

AC లో ఉండే వారికి అలోవెరా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.

తీవ్రమైన ఎండ వల్ల కలిగే మంటలో చల్లదనం, ఉపశమనం అందిస్తుంది.

మొటిమలు ఉన్న చర్మాన్ని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.

ఎలోవెరా, దోసకాయ రసాన్ని కలిపి మంచి టోనర్ తయారు చేయవచ్చు.

మొదటిసారి ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం.