బరువు పెరుగుతున్నారా? అయితే ఈ 5 కారణం కావచ్చు

Published by: Geddam Vijaya Madhuri

ఫుడ్ కంట్రోల్ చేసినా.. తమ బరువు తగ్గడం లేదని చాలామందికి ఫిర్యాదు ఉంటుంది.

వాస్తవానికి ఆహారపు అలవాట్లే కాదు బరువు పెరగడానికి ఇతర కారణాలు కూడా ఉంటాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం తగినంత నిద్ర లేకుంటే అది బరువు పెరగడానికి ప్రధాన కారణం కావచ్చు.

చిన్న పిల్లలలో కూడా ఊబకాయం సాధారణ సమస్యగా మారిపోయింది. పెద్దల్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది.

నిద్రలేమి కేవలం బరువు పెరగడానికి దారితీయడమే కాదు శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా హానికరం.

హార్మోన్ల మార్పులు లేదా హార్మోన్ల అసమతుల్యత కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు.

PCOS, హైపోథైరాయిడిజం ఉన్న స్త్రీలలో బరువు పెరగడం కామన్గా కనిపిస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

మీరు ఏవైనా మందులు తీసుకుంటున్నట్లయితే అవి కూడా బరువు పెరగడానికి దోహదపడవచ్చు.

నిపుణుల పర్యవేక్షణలో డైట్, జిమ్ చేస్తే బరువు అదుపులో ఉండే అవకాశం ఉంది.

అధిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి టిప్స్ తెలుసుకోండి. ఎందుకంటే ఇది బరువు పెరగడానికి కూడా దోహదపడుతుంది.

ఈ హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. పైగా ఒత్తిడికి గురైనప్పుడు శారీరక శ్రమను తగ్గిస్తాము.

అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అవ్వడం మంచిది.