బ్రెడ్ ఎక్కువ తింటే శరీరానికి కలిగే లాభ, నష్టాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటంతో వెంటనే శక్తి అందిస్తుంది.

ఫైబర్ ఉన్న బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.

వైట్ బ్రెడ్ ఎక్కువగా తింటే కాలరీలు పెరిగి బరువు పెరగవచ్చు.

రిఫైన్డ్ బ్రెడ్ (వైట్ బ్రెడ్) గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటంతో షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి.

ఫైబర్ తక్కువగా ఉండే బ్రెడ్ వల్ల మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు.

వైట్ బ్రెడ్‌లో విటమిన్స్, మినరల్స్ తక్కువగా ఉండటంతో పూర్తి పోషణ లభించదు.

రిఫైన్డ్ కార్బ్స్ అధికంగా తీసుకుంటే కొలెస్ట్రాల్, హార్ట్ రిస్క్ పెరుగుతుంది.

బ్రెడ్ ఒక్కటే తింటే ప్రోటీన్ సరిపోదు. కాబట్టి గుడ్లు, పీనట్ బట్టర్ వంటి వాటితో కలిపి తినాలి.

వైట్ బ్రెడ్‌కి బదులుగా బ్రౌన్ బ్రెడ్ లేదా మల్టిగ్రేన్ బ్రెడ్ ఎంచుకుంటే మంచిది.

ప్రతిరోజూ కాకుండా ఇదే కాకుండా డైట్‌లో వెరైటీ ఉండేలా చూసుకోవాలి.