గుడ్లతో కలిపి ఈ ఫుడ్స్ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో

Published by: Geddam Vijaya Madhuri

పాలకూరలో ఐరన్‌, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. గుడ్లలోని ప్రోటీన్‌తో కలిసి రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది.

టమోటాలో లైకోపిన్‌ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. గుడ్లతో కలిపి తింటే యాంటీఆక్సిడెంట్ ప్రభావం పెరుగుతుంది.

హెల్తీ ఫ్యాట్స్‌ అధికంగా ఉండే అవకాడో గుడ్లలోని పోషకాలను శరీరం సులభంగా గ్రహించేందుకు సహాయపడుతుంది.

మొలకల్లో ప్రోటీన్‌, విటమిన్స్‌ ఎక్కువగా ఉంటాయి. గుడ్లతో కలిపి తింటే మసిల్‌ గ్రోత్‌కు బాగా ఉపయోగపడుతుంది.

ఓట్స్ వంటి తృణధాన్యాలు వల్ల గుడ్లతో కలిపి తింటే ఎక్కువసేపు ఆకలి ఉండదు. బరువు నియంత్రణలో సహాయం చేస్తుంది.

క్యాప్సికమ్లో విటమిన్ C అధికంగా ఉండి ఇమ్యూనిటీ పెంచుతుంది. గుడ్లతో కలిపి ఆమ్లెట్‌గా తీసుకుంటే మంచి కాంబినేషన్.

చీజ్లో కాల్షియం, ప్రోటీన్‌ కలిసిన మంచి ఫుడ్. గుడ్లతో కలిపి తింటే ఎముకలు బలంగా మారుతాయి.

చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. గుడ్లతో కలిపి తింటే బ్రెయిన్‌, హార్ట్‌ హెల్త్ మెరుగవుతుంది.

చిలగడ దుంపలు కార్బోహైడ్రేట్స్‌ మంచి సోర్స్‌. గుడ్లతో కలిపి తింటే ఎనర్జీ ఎక్కువసేపు ఉంటుంది.

పచ్చిమిర్చి మెటబాలిజం పెంచుతాయి. గుడ్లతో కలిపి ఆమ్లెట్‌గా తింటే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి.