స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి అండర్‌వేర్ కారణమా?

Published by: Khagesh
Image Source: pexels

పురుషుల్లో టెస్టికల్స్‌ ఉష్ణోగ్రత కంట్రోల్‌లో ఉండాలి, టైట్‌ అండర్‌వేర్‌తో వేడి పెరిగి స్పెర్మ్‌ ఉత్పత్తి, కౌంట్‌పై ఎఫెక్ట్ పడుతుంది.

Image Source: pexels

హార్వర్డ్ సర్వే ప్రకారం లూజ్ బాక్సర్స్ ధరించే వారితో పోలిస్తే, టైట్ అండర్‌వేర్ ధరించే వారిలో స్పెర్మ్ కౌంట్ 17% తక్కువగా ఉంది.

Image Source: pexels

టైట్‌ ఇన్నర్‌వేర్ వల్ల ఉత్పత్తి అయ్యే శుక్రకణాల కదలిక సామర్థ్యం, ఆకృతి దెబ్బతినే అవకాశం ఉంది.

Image Source: pexels

నైలాన్, పాలిస్టర్, సింథటిక్ వంటి మెటీరియల్స్‌తో చేసిన అండర్‌వేర్లు గాలిని లోపలికి రానివ్వవు, చెమట పీల్చవు.

Image Source: pexels

దీనివల్ల వేడి, తేమ పెరిగి స్పెర్మ్‌కు హాని జరుగుతుంది. వంద శాతం కాటన్ దుస్తులే సురక్షితం.

Image Source: pexels

టైట్, సింథటిక్ దుస్తుల వల్ల ప్రైవేట్ భాగాలలో చెమట చేరి ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. ఇవి స్పెర్మ్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

Image Source: pexels

పడుకునేటైంలో అండర్‌వేర్ ధరించకపోవడం మంచిది.

Image Source: pexels

చాలా లూజ్‌గా ఉండే నైట్ వేర్ వల్ల రాత్రి వేళల్లో టెస్టికల్స్‌కు రక్తప్రసరణ జరిగి, స్పెర్మ్ కౌంట్ సహజంగా మెరుగవుతుంది.

Image Source: pexels

టైట్ అండర్‌వేర్ వల్ల తగ్గే స్పెర్మ్ కౌంట్ శాశ్వతం కాదు. లూజ్ బాక్సర్స్‌కు మారి, జాగ్రత్తలు తీసుకుంటే 2 నుంచి 3 నెలల్లో సాధారణ స్థితికి వస్తుంది.

Image Source: pexels

జిమ్, రన్నింగ్, స్పోర్ట్స్ ఆడేటప్పుడు మాత్రం అథ్లెటిక్ సపోర్టర్ లేదా బ్రీఫ్స్ ధరించాలి. లేదంటే ఇతర సమస్యలు వస్తాయి.

Published by: Khagesh

అండర్‌వేర్ మాత్రమే కాదు. ల్యాప్‌టాప్‌ ఒడిలో పెట్టుకుని వాడటం, వేడి నీళ్ల టబ్లలో ఎక్కువ సమయం ఉంటే స్పెర్మ్ కౌంట్ పడిపోతుంది.

Published by: Khagesh