పండుగ స్పెషల్ అందమైన ముగ్గులు
చాక్ లేదా రంగులతో కొన్ని రంగురంగుల డిజైన్లను తయారు చేసి దానిలో 'హ్యాపీ దీపావళి' అని రాయవచ్చు. దీనిని గుమ్మం దగ్గర వేయవచ్చు.
స్వస్తిక శుభ సమయానికి చిహ్నం. దీపావళి సమయంలో నాలుగు చతురస్రాలు వేసి స్వస్తిక్ రంగోలి వేయవచ్చు.
దీపావళి పూజ సమయంలో.. పూజ గది దగ్గర ఇలా వివిధ రంగులతో పూల ముగ్గులు వేయవచ్చు. ఇది క్యూట్‌గా, నిండుగా ఉంటుంది.
అన్ని సీజన్లకు, కార్యక్రమాలకు అనుకూలంగా ఉండే పూల డిజైన్ రంగోలి ఇది. లోటస్ ముగ్గు ఏ పండక్కి అయినా ఇట్టే సరిపోతుంది.
ఒక వృత్తాన్ని వేసి.. దానిని పార్టులుగా విభజించవచ్చు. ప్రతి విభాగాన్ని వేర్వేరు రంగు లేదా డిజైన్‌తో నింపవచ్చు. మరింత అందం కోసం పువ్వుల పెట్టవచ్చు.
ముగ్గుకి సైడ్ లైన్స్ కచ్చితంగా వేయాలి. అలాంటప్పుడు ఈ డిజైన్ రొటీన్‌కి భిన్నంగా ఉంటుంది.
ముగ్గు, రంగులతో కాకుండా.. పూ రేకులు, ఆకులతో ఓ అందమైన డిజైన్ వేయవచ్చు.
నెమలి ముగ్గు అనేది చాలామందికి ఆల్ టైమ్ ఫేవరెట్.. మీరు కూడా ఈసారి వేసి దీపాలతో అలంకరించేయండి.
రంగుల పొడులతో రంగురంగుల ఇంద్రధనస్సు వేయవచ్చు. దీనికి దీపాలు పెడితే పండుగ శోభ రెట్టింపు అవుతుంది.