పళ్లను (Teeth Damage) పాడుచేసే చెడు అలవాట్లు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

స్వీట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత నీటితో పుక్కిలించడం చాలా ముఖ్యం.

పళ్లు కొరికే అలవాటు వల్ల దవడలో నొప్పి వస్తుంది.

ఉదయాన్నే దవడలో నొప్పి అనిపిస్తే డాక్టర్ని సంప్రదించడం మానకండి.

నోటితో శ్వాస తీసుకోవడం వల్ల లాలాజలం తగ్గుతుంది. నోరు పొడిబారుతుంది.

నోరు పొడిబారిపోవడం వల్ల దంతక్షయం అయ్యే ప్రమాదం పెరుగుతుంది.

పళ్లతో ఎప్పుడూ బాటిల్ తెరవకూడదు.

వస్తువులను కొరికే అలవాటు వల్ల పళ్ళలో పగుళ్లు ఏర్పడవచ్చు.

పదే పదే చిరుతిళ్లు తినడం వల్ల నోటిలో యాసిడ్ దాడి పెరుగుతుంది.

దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి స్నాక్స్ తినే ఫ్రీక్వెన్సీని తగ్గించండి.