సాఫ్ట్ డ్రింక్స్, ప్యాక్ చేసిన పండ్ల రసాలలో శుద్ధి చేసిన చక్కెర అధికంగా ఉంటుంది. ఒక్క సోడా డబ్బా కూడా రక్తంలోని చక్కెరను ప్రమాదకరంగా పెంచేస్తుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనికి దూరంగా ఉండాలి.
వైట్ బ్రెడ్, తెల్లని బియ్యం, పాస్తా వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లలు త్వరగా గ్లూకోజ్‌గా విచ్ఛిన్నమవుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు.
ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, పకోడీలు కేలరీలను పెంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ పెంచి.. మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మరింత దిగజారుస్తాయి. అలాగే త్వరగా బరువు పెరిగేలా చేస్తాయి.
ప్రాసెస్ చేసిన మాంసాలలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. మధుమేహం ఉన్నవారికి ఇది మంచిది కాదు.
ఫ్యాట్ ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు కూడా మంచిది కాదు. టోన్డ్ మిల్క్, క్రీమ్, చీజ్, వెన్నలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఈ ఆహారాలు మంటను ప్రేరేపిస్తాయి. కొలెస్ట్రాల్ను పెంచుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఇన్సులిన్ నిరోధకతను తీవ్రతరం చేస్తాయి.
చిప్స్, బిస్కెట్లు వంటి ప్యాకేజ్ చేసిన స్నాక్స్‌లో అధిక స్థాయిలో ఉప్పు, అనారోగ్యకరమైన నూనెలు ఉంటాయి. ఈ పదార్ధాలు అకస్మాత్తుగా చక్కెర పెరిగేలా చేసి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.
సెరెల్స్ ఆరోగ్యానికి మంచివి కావని చెప్తారు. కానీ వాస్తవానికి వీటిలో చక్కెర అధికంగా, ఫైబర్ తక్కువగా ఉంటాయి. ఇవి రోజు ప్రారంభంలోనే రక్తంలోని చక్కెర స్థాయిలు వేగంగా పెంచేస్తాయి.
ట్రెడీషనల్ స్వీట్స్, చాక్లెట్లు, కేకులు.. చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని పూర్తిగా నివారించాలి. లేదంటే రక్తంలో గ్లూకోజ్ తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉంది.
ఫ్లేవర్డ్ యోగర్ట్, ఐస్ క్రీమ్స్ వంటివాటిలో షుగర్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని చిన్న మోతాదులో తీసుకోవడం కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదమే. ఇవి రక్తంలో చక్కెర సమతుల్యతను దెబ్బతీస్తాయి.
అధికంగా మద్యం సేవించడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు, కాలేయ ఆరోగ్యం దెబ్బతింటాయి. మధుమేహం కోసం వేసుకునే మందుల ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి ప్రమాదకరంగా మారతాయి.