నారింజలు ఎవరు తినకూడదో తెలుసా? ఆ సమస్యలు పెరుగుతాయట

Published by: Geddam Vijaya Madhuri

నారింజలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది గ్యాస్, మంట సమస్యలను మరింత పెంచుతుంది.

కడుపులో గాయాలు, అల్సర్స్ ఉన్నవారికి నారింజలు మంటను పెంచి ఇబ్బంది కలిగిస్తాయి.

నారింజ తింటే ఛాతిలో మంట, గొంతులో మంట ఎక్కువ అవుతుంది.

నారింజలో సహజ చక్కెర ఉంటుంది. ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది.

నారింజలో పొటాషియం ఉంటుంది. కిడ్నీ సరిగా పని చేయకపోతే ఇది ప్రమాదకరంగా మారవచ్చు.

సిట్రస్ ఫ్రూట్స్ పళ్ళపై ఉన్న ఎమల్స్‌ను దెబ్బతీసి సెన్సిటివిటీ పెంచుతాయి.

కొందరికి నారింజ వల్ల స్కిన్ రాషెస్, ఇర్రిటేషన్, దద్దుర్లు రావచ్చు.

కొన్ని సందర్భాల్లో సిట్రస్ ఫ్రూట్స్ మైగ్రేన్ ట్రిగ్గర్ చేయవచ్చు.

ఉదయం ఖాళీ కడుపుతో నారింజ తింటే అసిడిటీ, కడుపు మంట రావచ్చు.

ఈ సమస్యలుంటే మీరు నారింజలు అవాయిడ్ చేస్తే మంచిది.