అందాల భామ శ్రద్ధా ఆర్య పేరు బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే. కుండలి భాగ్య' సీరియల్ ద్వారా శ్రద్ధా ఆర్య ఫేమస్ అయ్యారు. 'నాచ్ బలియే' డ్యాన్స్ షోతోనూ ఆకట్టుకున్నారు. శ్రద్ధా ఆర్య తెలుగులో కూడా సినిమాలు చేశారని మీకు తెలుసా? దర్శకుడు కోదండరామిరెడ్డి కుమారుడు వైభవ్ హీరోగా పరిచయమైన 'గొడవ'లో శ్రద్ధా ఆర్య హీరోయిన్. 'గొడవ' తర్వాత తెలుగులో 'రోమియో', 'కోతి మూక' సినిమాలు కూడా చేశారు. కథానాయికగా శ్రద్ధా ఆర్య తొలి సినిమా తమిళంలో ఎస్.జె. సూర్యకు జోడిగా నటించిన 'కల్వనిన్ కాదలై'. కథానాయికగా నటించడం కంటే ముందు నుంచి శ్రద్ధా ఆర్య టీవీ ప్రాజెక్ట్స్ చేశారు. హిందీ సీరియళ్లు 'డ్రీమ్ గాళ్', 'కుండలి భాగ్య', 'తుమ్హారీ పాఖి' శ్రద్ధా ఆర్యకు పేరు తెచ్చాయి. ఇప్పుడు హిందీ సీరియళ్లతో శ్రద్ధా ఆర్య బిజీగా ఉన్నారు. (Image Courtesy : sarya12 / Instagram)