గ్రీన్ టీ కేవలం పెద్దలకేనా? పిల్లలకి కూడా తాగించవచ్చా?
పెద్దలు గ్రీన్ టీ తాగుతుంటే మేమూ తాగుతామనే పిల్లలు కూడా ఉంటారు. మరి పిల్లలకు తాగించవచ్చా?
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పెద్దలకు ఎంతో మేలు చేసే పానీయం ఇది.
గ్రీన్ టీలో ఉన్న సుగుణాలు పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
పిల్లలకు గ్రీన్ టీ ఇవ్వకూడదనే నియమం లేదు. కానీ మొదటిసారి తాగించాక ఏమైనా రియాక్షన్ వస్తే మాత్రం వెంటనే ఆపేయాలి.
నిద్రపట్టక ఇబ్బంది పడే పిల్లలకు గ్రీన్ టీ ఇవ్వకూడదు. కెఫీన్ నిద్రను దగ్గరకు రానివ్వదు.
కాస్త చేదుగా ఉండే గ్రీన్ టీ పిల్లలు తాగలేకపోతే నిమ్మరసం, తేనెలాంటివి కలిపి ఇవ్వచ్చు.
దీనివల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.జలుబు, దగ్గు వచ్చినప్పుడు గ్రీన్ టీ ఇస్తే మంచిది.
చాక్లెట్లు, తీపి పదార్థాలు అధికంగా తినే పిల్లలకు గ్రీన్ టీ ఇస్తే మేలు. ఎందుకంటే వారి దంతల్లో కావిటీలు వచ్చే అవకాశం ఎక్కువ. గ్రీన్ టీ దంతాల్లోని బ్యాక్టిరియాను చంపి క్యావిటీలనుంచి కాపాడుతుంది.
అజీర్తి సమస్యలతో బాధపడే పిల్లలకు రోజుకో కప్పు గ్రీన్ టీ తాగిస్తే చాలా మంచిది.