చర్మ సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు. కొన్ని లక్షణాలు కిడ్నీ వ్యాధికి సంకేతాలు. అవేంటో చూడండి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం.. చర్మం పొడిగా లేదా దురదగా ఉండటం కిడ్నీ వ్యాధికి సంకేతం. పొడిబారిన, చర్మం దురద పెట్టడం ఎముకల వ్యాధికి కూడా సంకేతం కావచ్చు. ఎముకుల వ్యాధి కూడా మూత్రపిండ వ్యాధితో పాటు వస్తుంది. రక్తంలో ఖనిజాలు, పోషకాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు కిడ్నీలు సక్రమంగా పనిచేయవు. కొందరిలో చర్మం రంగు కూడా మారుతుంది. ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి లక్షణం కూడా కావచ్చు. మీ శరీరంలో టాక్సిన్స్ ఏర్పడినా, మీ కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేయకపోయినా చర్మం రంగు మారుతుంది. మీ కాళ్లు లేదా కళ్ల వాపు ఎక్కువ రోజులు కొనసాగితే తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. చర్మంపై పొక్కులు, దద్దర్లు ఏర్పడినట్లయితే మూత్రపిండ వ్యాధికి మరొక సంకేతంగా భావించాలి కొన్నిసార్లు మూత్రపిండ రోగులు చర్మంలో కాల్షియం డిపాజిట్స్ కూడా కనిపిస్తాయి. కాబట్టి, పై లక్షణాల్లో ఏది గమనించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. Images and Videos Credit: Pixels and Pixabay