చాక్లెట్లు ఆరోగ్యానికి మంచివేనని కొన్ని అధ్యయనాలు, అనారోగ్యకరమని మరికొన్ని స్టడీస్ చెప్పాయి.

ఈ గందరగోళాన్ని తొలగించేందుకు తాజాగా మరో అధ్యయనం నిర్వహించారు.

చాక్లెట్లు తింటే చిన్న వయస్సులోనే చనిపోయే ప్రమాదం 12 శాతానికి తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.

అంతేగాక గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదం 16 శాతానికి తగ్గుతుందని తెలిపింది.

వారానికి 2 సాధారణ సైజు డైరీ మిల్క్ బార్‌లు తినేవారికి మధుమేహం వచ్చే అవకాశం 4 రెట్లు తగ్గుతుందట.

చాక్లెట్ చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తుందని అధ్యయనం తెలిపింది.

చాక్లెట్లో ఉండే కోకో ఫ్లేవనాయిడ్స్ సమ్మేళనాలు రక్త నాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయట.

సాధారణ చాక్లెట్లతో పోల్చితే డార్క్ చాక్లెట్లు ఆరోగ్యానికి మంచివని నిపుణులు సూచిస్తున్నారు.

డార్క్ చాకొలెట్ తినడం వల్ల మెదడులో ఉండే డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదలవుతుంది.

మూడ్ స్వింగ్స్‌ను తగ్గించడంలో చాక్లెట్ సహకరిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

చిన్న చాక్లెట్ ముక్క మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

కోకో పొడి ఉండే పానీయాలు, లేదా చాక్లెట్ల వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగుపడుతుందట.

Images and Videos Credit: Pixels and Pixabay