సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ బుల్లెట్ బండెక్కి సోషల్ మీడియాలో సందడి చేసింది. 'నాయకుడు' సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 'జెండా ఎగురుతుంది' అంటూ ఓ స్పెషల్ రీల్ షేర్ చేసింది. అందులో మహానటి పోషించిన కాలేజ్ స్టూడెంట్ పాత్ర కోసం బైక్ నడపడం ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. బైక్ డ్రైవింగ్ లో కీర్తికి హీరో ఉదయనిధి స్టాలిన్ సలహాలు ఇవ్వడాన్ని మనం చూడొచ్చు. సెట్స్ లో కీర్తి తన పెట్ డాగ్ తో కలిసి బుల్లెట్ నడుపుతున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 'నాయకుడు' చిత్రం మంచి విజయం సాధించడమే కాదు, మహానటికి మంచి పేరు తెచ్చిపెట్టింది. 'నేను శైలజ' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అలనాటి నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన 'మహానటి' చిత్రంలో అధ్బుతమైన నటన కనబరిచి, జాతీయ అవార్డు అందుకుంది. ఈ ఏడాదిలో 'దసరా' మూవీతో పాన్ ఇండియా హిట్టు కొట్టిన కీర్తి.. 'భోళా శంకర్' తో భారీ ఫ్లాప్ చవిచూసింది. 'సైరన్' 'రఘు తాత' 'రివాల్వర్ రీటా' 'కన్నివేది' వంటి సినిమాల్లో అమ్మడు నటిస్తోంది.