రిలయన్స్ జియో మోస్ట్ అవైటెడ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఇటీవలే కొత్త అప్‌డేట్ వచ్చింది.

జియో ఫోన్ 5జీ ఇమేజ్ ఇంటర్నెట్‌లో లీక్ అయింది.

ఈ ఏడాది దీపావళికి జియో 5జీ ఫోన్‌ను విడుదల చేయవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇంతకు ముందు కూడా ఈ ఫోన్‌కు సంబంధించిన సమాచారం ఎన్నోసార్లు లీక్ అయింది.

జియో ఫోన్ 5జీ యూనిసోక్ 5జీ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ని కలిగి ఉండవచ్చు.

ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉన్నాయి.

వీటిలో ప్రధాన కెమెరా 13 మెగాపిక్సెల్ కాగా, మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది.

ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాతో సెల్ఫీలు తీసుకోవచ్చు.

దీని ధర సుమారు రూ. 10,000 రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.