వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ బుధవారం మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.33,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999గా ఉంది. మిస్టీ గ్రీన్, టెంపెస్ట్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. జులై 15వ తేదీ నుంచి అమెజాన్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా దీన్ని విక్రయించనున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు.