రియల్‌మీ 10 ప్రో సిరీస్ ఫోన్లు మనదేశంలో లాంచ్ కానున్నాయి.

డిసెంబర్ 8వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు ఇవి మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి.

ఈ సిరీస్‌లో రెండు ఫోన్లు ఉండనున్నాయి.

అవే రియల్‌మీ 10 ప్రో, రియల్‌మీ 10 ప్రో ప్లస్.

వీటిలో రియల్‌మీ 10 ప్రో ఒక ప్రత్యేకత ఉండనుంది.

కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వచ్చే మొదటి బడ్జెట్ ఫోన్ ఇదే కానుంది.

ఈ రెండు ఫోన్లలోనూ వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

5000 ఎంఏహెచ్ బ్యాటరీని రెండిట్లోనూ అందించారు.

రియల్‌మీ 10 ప్రో రూ.20 వేల నుంచి, రియల్‌మీ 10 ప్రో ప్లస్ ధర రూ.25 వేల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం-సిరీస్, ఏ-సిరీస్‌లోని హైఎండ్ ఫోన్లతో ఇవి పోటీ పడనున్నాయి.