రిలయన్స్ జియో కొత్త 4జీ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనికి జియో భారత్ వీ2 4జీ అని పేరు పెట్టింది. 2జీ మొబైల్ ఉపయోగిస్తున్న 25 కోట్ల మంది లక్ష్యంగా ఈ ఫోన్‌ను తీసుకువచ్చారు. ఈ మొబైల్ ధరను రూ.999గా నిర్ణయించారు. ప్రస్తుతం మనదేశంలో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఫోన్లలో అత్యంత చవకైనది ఇదే. రెడ్, బ్లూ కలర్ ఆప్షన్లలో జియో భారత్ వీ2 4జీ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన బీటా ట్రయల్ జులై 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతగా 10 లక్షల ఫోన్లను తయారు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 6500 ప్రాంతాల్లో దీనికి సంబంధించిన ట్రయల్స్ జరగనున్నాయి. ఈ మొబైల్ ఫీచర్లను కంపెనీ పూర్తి స్థాయిలో రివీల్ చేయలేదు.