త్రిగ్రాహి యోగం అంటే ఏంటి - దీని ప్రభావం ఎలా ఉంటుంది జనవరి 2024లో సూర్యుడు, బుధుడు , శుక్రుడు రాశి మారబోతున్నారు. ప్రస్తుతానికి కుజుడు సంచరిస్తున్న ధనస్సు రాశిలోనే ఈ మూడు గ్రహాలు కూడా మారబోతున్నాయి. 3 గ్రహాలు ఒకేరాశిలో సంచరిస్తే త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది త్రిగ్రాహి యోగం వల్ల కొన్ని రాశులవారికి ధనవృద్ధి మరికొన్ని రాశులవారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి. వృశ్చిక రాశిలో వక్రంలో సంచరిస్తున్న బుధుడు..జనవరి 9 న ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు ప్రస్తుతం ధనస్సు రాశిలోనే సంచరిస్తున్నాడు. 15 జనవరి 2024న మకరరాశిలోకి ప్రవేశిస్తాడు ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న శుక్రుడు జనవరి 19న ధనస్సులోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే కుజుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నాడు త్రిగ్రాహియోగం వల్ల మేషం, మిథునం, కన్యా, కుంభ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది