'జబర్దస్త్' జడ్జ్ అంటే రోజా గుర్తొస్తారు. అయితే, మంత్రి అయ్యాక షో నుంచి ఆమె తప్పుకొన్న సంగతి తెలిసిందే. రోజాతో పాటు నాగబాబు చాలా ఏళ్ళు 'జబర్దస్త్' జడ్జ్‌గా చేశారు. ఇప్పుడు ఆయన 'కామెడీ స్టార్స్ ధమాకా' చేస్తున్నారు. నాగబాబు 'జబర్దస్త్' మానేశాక... ఆయన స్థానంలో గాయకుడు మనో ఎక్కువ రోజులు ఆ కుర్చీలో ఉన్నారు. రోజా తర్వాత మనో కూడా కొన్ని ఎపిసోడ్స్ కనిపించలేదు. ఇప్పుడు వస్తున్నారనుకోండి. అయితే, రోజా ప్లేసులో ఇంద్రజ వచ్చారు. ప్రస్తుతం అయితే ఇంద్రజతో పాటు సదా జడ్జ్ కుర్చీలో కనిపిస్తున్నారు. పూర్ణ కూడా 'జబర్దస్త్' జడ్జ్‌గా సందడి చేశారు. ప్రజెంట్ 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో రెగ్యులర్ గా కనిపిస్తున్నారు. ఒక ఎపిసోడ్ లో హీరోయిన్ శ్రద్ధా దాస్ 'జబర్దస్త్' జడ్జ్‌గా సందడి చేశారు. సుమ భర్త, నటుడు రాజీవ్ కనకాల సైతం ఒక ఎపిసోడ్ లో 'జబర్దస్త్' జడ్జ్‌గా కనిపించారు. ఆయన్ను గెస్ట్ జడ్జ్ అనుకోవచ్చు. జడ్జ్‌లు, టీమ్ లీడర్లు ఎంత మంది మారినా... 'జబర్దస్త్' యాంకర్ మాత్రం అనసూయే అనసూయ 'జబర్దస్త్' యాంకర్ అయితే... రష్మీ గౌతమ్ 'ఎక్స్ట్రా జబర్దస్త్' యాంకర్. అందులో మార్పు లేదు.