IPLలో కొందరు ఆటగాళ్ళు తమ కెరీర్ మొత్తం ఒకే జట్టులో ఆడారని తెలుసా మీకు.

2008 నుండి విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. ఆయన జట్టు ప్రధాన పేస్ బౌలర్.

సచిన్ టెండూల్కర్ తన మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు.

ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్ జట్టుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు.

సునీల్ నరైన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. జట్టును 2008లో మొదటి ఐపీఎల్ టైటిల్‌ తెచ్చిపెట్టాడు.

లసిత్ మలింగ ముంబై ఇండియన్స్ జట్టుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. జట్టు విజయాలలో తనొక కీలక బౌలర్.