ఐపీఎల్ కొత్త రూల్స్ ఇవే !

Published by: Jyotsna

దేశ వ్యాప్తంగా మొదలైన ఐపీఎల్‌ మ్యాచుల సందడి

తొలి మ్యాచ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌- బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ మధ్య

సీజన్‌ను ఉత్సాహంగా మార్చడానికి బీసీసీఐ కొత్త నియమాలు

వైడ్ బాల్స్ కోసం హాక్-ఐ టెక్నాలజీ..

ఈ సీజన్‌లో, ఐపీఎల్ ఆఫ్‌సైడ్, హెడ్-హై వైడ్ బాల్స్‌ను నిర్ణయించడానికి హాక్-ఐ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ టెక్నిక్ ఇప్పటికే నడుము వరకు ఉన్న నో బాల్స్ కోసం ఉపయోగించబడుతోంది.

లాలాజలంపై నిషేధం ఎత్తివేత..

ఈ సారి ఆటగాళ్ళు రివర్స్ స్వింగ్ సాధించడానికి బంతిపై ఉమ్మి పూయడానికి అంగీకరించింది.

ఇంపాక్ట్ ప్లేయర్ నియమాలు..

గతంలో లాగానే మ్యాచ్ సమయంలో 11 మంది ఆటగాళ్లతో పాటు, జట్లు ఒక అదనపు ఆటగాడుంటాడు.

ప్లేయింగ్ ఎలెవన్‌లోని ప్రతి ఆటగాడికి రూ.7.5 లక్షల అదనపు మ్యాచ్ ఫీజు .

రెండో ఇన్నింగ్స్‌లో రెండో బాల్‌

మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ కోసం రెండో బంతి అనే కొత్త నియమాన్ని కూడా బీసీసీఐ ఈ ఏడాది తీసుకొచ్చింది.

స్లో ఓవర్ రేట్ కోసం, కెప్టెన్లపై మ్యాచ్ నిషేధం లేదు కానీ

జరిమానాలు విధించబడతాయి.