కొన్ని జట్లు ఐపీఎల్ 2025 కోసం కొత్త జెర్సీలను ఆవిష్కరించాయి.

మరి కొన్ని జట్లు తమ జెర్సీలలో ఎలాంటి మార్పులు చేయలేదు.

మార్పులు జరిగినా, అవి ప్రధానంగా జెర్సీలపై స్పాన్సర్ల పేర్లకు మాత్రమే పరిమితం.

చెన్నై సూపర్ కింగ్స్ 2008 తర్వాత 2021లో తొలిసారి కొత్త జెర్సీని ఆవిష్కరించింది.

ఈ సందర్భంగా, వారు భారత ఆర్మీకి గౌరవ సూచకంగా కామోఫ్లాజ్ డిజైన్‌ను జెర్సీ భుజం భాగంలో చేర్చారు.

ఈ కామోఫ్లాజ్ భారత సైనికుల నిస్వార్థ సేవకు జట్టుఇచ్చే గౌరవాన్ని ప్రదర్శిస్తుంది.

ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంలో, సీఎస్‌కే ఆర్మీకి 2 కోట్ల రూపాయల చెక్కును అందించింది.

ఎమ్‌ఎస్ ధోనీ భారత సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాను కలిగి ఉన్నారు.

2019లో,ధోనీ పారాచూట్ రెజిమెంట్‌తో కలిసి శిక్షణ కూడా పొందారు.

ఈ రకంగా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీకి భారత ఆర్మీతో అనుబంధం ఉన్నట్టే కదా