ఐపీఎల్‌లో కెప్టెన్ అవ్వడానికి ముందు అత్యధిక మ్యాచ్‌లు ఆడింది జడేజానే. తను అంతకుముందు 200 మ్యాచ్‌లు ఆడాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో మనీష్ పాండే (153), కీరన్ పొలార్డ్ (137), అశ్విన్ (111), సంజు శామ్సన్ (107), భువనేశ్వర్ (103) ఉన్నారు.

శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే, శామ్ బిల్లింగ్స్ కోల్‌కతా తరఫున మొదటి మ్యాచ్ ఆడారు.

కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా చెన్నై జట్టులో ధోని ఆడటం ఇదే మొదటిసారి.

ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన డ్వేన్ బ్రేవో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా మలింగ (170) సరసన నిలిచాడు.

2019లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ తర్వాత ధోని అర్థసెంచరీ సాధించడం ఇదే తొలిసారి.

నేటి మ్యాచ్‌తో కలిపి రాయుడు ఐపీఎల్‌లో మొత్తంగా 15 సార్లు రనౌటయ్యాడు.

ఇది ఐపీఎల్‌లో రెండో అత్యధికం. 16 రనౌట్లతో మొదటి స్థానంలో శిఖర్ ధావన్, గౌతం గంభీర్ నిలిచారు.
(All Images Credits: IPL/BCCI)