మార్చి 27 రాశిఫలాలు



మేషం
భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. కొంతమంది మీ గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. ఏదైనా పెద్ద డీల్ లాభాన్నిస్తుంది. ఓ ప్లాన్ ప్రకారం పనులు పూర్తిచేయండి. ప్రేమ సంబంధాల్లో బలం ఉంటుంది. ఈరోజు మీరు అనారోగ్యంగా, ఆందోళనగా ఉంటారు.



వృషభం
మీరు కెరీర్‌లో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. సమాజంలో మీకు ఆదరణ పెరుగుతుంది. ఇంట్లో పెద్దల మాట వినండి. మీరు అన్ని పనులను శాంతియుతంగా చేయాలి. పిల్లలతో మంచి సమయం గడుపుతారు. కొత్త పనులు ప్రారంభించవద్దు. ఈ రోజు మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆహారం, పానీయాలపై శ్రద్ధ వహించండి.



మిథునం
ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. నిలిచిపోయిన పనులను పూర్తి చేయడంపై ఒత్తిడి ఉంటుంది. ఉన్నత విద్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన లోపం ఉండవచ్చు. మీ సహోద్యోగుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి.



కర్కాటకం
జీవిత భాగస్వామి మద్దతుతో, మీ మనోబలం, విశ్వాసం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. మీ రంగంలో పురోగతి కారణంగా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీరు మానసికంగా చాలా రిలాక్స్‌గా ఉంటారు. ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు ఆఫీసు వాతావరణం బాగుంటుంది



సింహం
మీరు వ్యాపార సంబంధిత పనుల్లో విజయం సాధిస్తారు. పాత అనుభవాల నుంచి పూర్తి ప్రయోజనం పొందుతారు. మీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. పెరుగుతున్న అప్పులు తీర్చేందుకు సిద్ధంగా ఉంటారు. ఈరోజు మీకు ఇష్టమైన పనిపై ఆసక్తి ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. సృజనాత్మక పనిపై ఆసక్తి చూపుతారు.



కన్య
ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మికతపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. మీరు ఆస్తి సంబంధిత వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో మందగమనం ఉంటుంది. మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. మనసులో ఆందోళన కలుగుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి.



తుల
బ్రహ్మచారుల వివాహానికి అడ్డంకులు ఎదురవుతాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది..తల్లిదండ్రులు గమనించి ఆసక్తి తగ్గకుండా ప్రోత్సహించండి. మీకు ప్రాధాన్యత లేని ప్రదేశంలో స్పందించకండి. వివాదం కారణంగా మీరు కలత చెందుతారు. కుటుంబ సమస్యలు తోబుట్టువులతో చర్చించవచ్చు.



వృశ్చికం
వర్కింగ్ స్టైల్‌ మార్చుకునేందుకు ప్రయత్నించండి. సోదరులు, స్నేహితుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. వ్యాపారంలో అమ్మకాలు పెరిగి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీరు శుభవార్తల వింటారు. కుటుంబంలో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు ప్రతికూలతకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉండదు.



ధనస్సు
ఎక్కువ పని కారణంగా ఈరోజు అలసిపోతారు. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. రక్తపోటు రోగులు ఒత్తిడికి దూరంగా ఉండాలి. కుటుంబంలోని పెద్దల మాటలు, సలహాలు మీకు నచ్చవు. వ్యక్తిగత సంబంధాల్లో ప్రేమ తక్కువగా ఉంటుంది. స్వార్థపూరిత వైఖరి కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి.



మకరం
ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు కుటుంబానికి తగినంత సమయం ఇస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. ఆన్‌లైన్ వ్యాపారంలో అమ్మకాలు పెరుగుతాయి. ఆరోగ్య సంబంధిత ఫిర్యాదులు ఉంటాయి. మీరు మానసికంగా గందరగోళానికి గురవుతారు.



కుంభం
ఈ రోజంతా మీరు చికాకుగా ఉంటారు. మీ మాటను, కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఈరోజు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. కొత్తగా ప్రారంభించే పనులకు అనుకూలమైన రోజు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. సామాజిక కార్యక్రమం నిర్వహిస్తారు.ఆనందంగా ఉంటారు.



మీనం
మీరు మీ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తారు. మీ పనులు చాలా వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉపాధి లభిస్తుంది. మీరు వ్యాపార ప్రయాణాల నుంచి ప్రయోజనం పొందుతారు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది.