అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్, సాయిధరమ్ చెప్పిన కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు మొదట్లో నాకు విగ్రహారాధన అలవాటుండేది కాదు. సినిమాల్లోకి వచ్చాకే అలవాటు చేసుకున్నా. ‘బాబాయ్ జీవితం చాలా బోరింగ్. అస్సలు సీక్రెట్లేవి ఉండవు’ - రామ్ చరణ్ నేను కోరికతోనో, వ్యామోహంతోనో మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు. కుదరక చేసుకున్నా. నేను హీరో అవ్వడానికి వదిన కారణం. అల్లు అరవింద్‌కు నన్ను హీరో చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఖుషి అయ్యాక ఐదు సినిమాలు డైరెక్ట్ చేసి రిటైర్ అయిపోదాం అనుకున్నా. అతడు కథ చెప్పేటప్పుడు నేను నిద్రపోయానని త్రివిక్రమ్ నన్ను తిడుతూ ఉంటాడు. ‘మా అమ్మ కంటే బాబాయ్ దగ్గరే నాకు చనువు ఎక్కువ.’ - రామ్ చరణ్. ‘అమ్మాయిలను ఎలా గౌరవించాలో మామయ్య దగ్గరే నేర్చుకున్నా’ - సాయిధరమ్ తేజ్