తప్పనిసరిగా ఇన్‌స్టాలేషన్

టెలికమ్యూనికేషన్స్‌ విభాగం మొదట్లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం సంచార్ సాథీ అప్లికేషన్ దేశంలోని పౌరులందరి మొబైల్స్‌లో డిఫాల్ట్‌గా అందించాలని నిర్ణయించారు.

Published by: Khagesh

డిలీట్‌ ఆప్షన్ లేకపోవడంతో వివాదం

ఈ ఆదేశంలో వివాదాస్పదం కావడానికి ప్రధాన కారణం మొదట్లో వినియోగదారులు ఈ అప్లికేషన్‌ను అన్‌ ఇన్‌స్టాల్ చేయలేరు అని ప్రభుత్వం పేర్కొనడం.

ప్రధాన లక్ష్యం- సైబర్ మోసాల నివారణ

భారత దేశంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలను నిరోధించడానికి సైబర్ భద్రతను పెంచడానికి ప్రభుత్వం ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

అన్ని ఫోన్‌లకు విస్తరణ

కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న అన్ని ఫోన్‌లకు వర్తిస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా వాడకలో ఉన్న పాత స్మార్ట్ ఫోన్‌లలో కూడా ఇన్‌స్టాల్ చేస్తారు.

కంపెనీల బాధ్యత

ఆపిల్, శామ్‌సంగ్, వివో, షియోమి, గూగుల్‌ సహా అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఈ ప్రభుత్వ ఆదేశాన్ని 90 రోజుల్లో అమలు చేయాలని టెలికాం శాఖ స్పష్టం చేసింది.

ప్రయోజనం ఏంటీ?

చోరీ అయిన లేదా పోగొట్టుకున్న ఫోన్‌లను ఐఎంఈఐ నెంబర్‌తో గుర్తించి, మోసాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. లక్షల ఫోన్‌లు బ్లాక్ చేసింది, మోసపూరిత ముఠాల ఆట కట్టించింది.

ప్రజాదరణ- విశ్వసనీయత

ఈ యాప్‌ పెద్ద సంఖ్యలో ఇన్‌స్టాల్ అవుతోంది. విశ్వసనీయత,ప్రజాదరణ పెరిగినందున డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

గోప్యతపై ఆందోళన

ఈ యాప్‌ తప్పనిసరికావడంపై ఇంటర్నెట్‌ ఫ్రీడం ఫౌండేషన్‌ వంటి సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. వినియోగదారుడి ఫోన్‌పై ప్రభుత్వం నిఘా పెరిగే ప్రమాదం ఉందని విమర్శించాయి.

అడ్వాన్స్‌డ్‌ యాక్సెస్‌

ఈ యాప్‌ సిస్టమ్‌ స్థాయి లేదా రూట్‌స్థాయి యాక్సెస్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో కాల్‌ లాగ్‌లు, ఫోటోలు, ఎస్‌ఎంఎస్‌ పంపడం వంటి ప్రమాదకరమైన అనుమతులను అడుగుతోంది.

తప్పని సరికాదు

గోప్యతపై వస్తున్న ఆందోళన వల్ల టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ యాప్‌ తప్పనిసరి కాదని, వినియోగదారులు ఇష్టం లేకుంటే యాప్‌ను తొలగించుకోవచ్చని తెలిపారు.