అద్దెకు ఉండే వారికి ఎలాంటి చట్టపరమైన హక్కులున్నాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారతదేశంలో ఇల్లు అద్దెకు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది

Image Source: pexels

చాలా మంది అద్దెకు ఉండే వారికి చట్టపరమైన హక్కుల గురించి పూర్తి అవగాహన ఉండదు

Image Source: pexels

అలాంటప్పుడు, అద్దెదారుల చట్టపరమైన హక్కులు తెలుసుకుంటే వారికి ప్రయోజనం ఉంటుంది

Image Source: pexels

ఇంటి ఓనర్ ఇష్టం వచ్చినట్లు అద్దె పెంచకూడదు. రాష్ట్ర అద్దె నియంత్రణ చట్టం ప్రకారం మాత్రమే పెంచాల్సి ఉంటుంది

Image Source: pexels

అద్దెదారుడు ఇంటి యజమాని నుండి రాతపూర్వక అద్దె ఒప్పందం పొందటానికి పూర్తి అధికారం కలిగి ఉంటాడు.

Image Source: pexels

సరైన చట్టపరమైన కారణం లేదా నోటీసు లేకుండా అద్దెదారుని ఇంటి నుంచి ఖాళీ చేయడానికి వీలు లేదు

Image Source: pexels

ఇంటికి అవసరమైన మరమ్మతులు చేయించడం ఇంటి యజమాని బాధ్యత, కానీ టెనెంట్‌కు సంబంధం ఉండదు

Image Source: pexels

అద్దెకు ఇచ్చే సమయంలో చేసిన సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని ఓనర్లు తిరిగి ఇవ్వక తప్పదు.

Image Source: pexels

టెనెంట్ అనుమతి లేకుండా ఇంటి ఓనర్ అద్దె ఇంట్లోకి ప్రవేశించకూడదు

Image Source: pexels