నవంబర్ 10న సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఐ20 కారులో భారీ పేలుడు సంభవించింది

Image Source: pti

ఈ భారీ పేలుడుతో మరికొన్ని కార్లు, బైక్స్ ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో నవంబర్ 11 మధ్యాహ్నం వరకు 12 మంది చనిపోయారు.

Image Source: pti

ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన ఉగ్రవాద దాడి అని, సంఘటనా స్థలంలో ఐఈడీ అవశేషాలు లభించాయని పోలీసులు తెలిపారు.

Image Source: pti

ఢిల్లీ పోలీసులు యుఏపీఏ, విస్ఫోటక చట్టం కింద కేసు నమోదు చేశారు

Image Source: pti

పేలుడుకు ఉపయోగించిన కారు హర్యానాలోని గుర్గావ్ నార్త్ ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పటికే అది చాలాసార్లు చేతులు మారింది.

Image Source: pti

ఐ20 కారు పేలుడుకు మూడు గంటల ముందు ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్కింగ్ చేసినట్లు గుర్తించారు.

Image Source: pti

కారును పార్క్ చేసింది మొహమ్మద్ ఉమర్ గా గుర్తించారు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ తో సంబంధం కలిగి ఉన్నాడు.

Image Source: pti

తమ టీమ్ దొరికిపోవడంతో ఉమర్ కారులోనే ప్రమాదకర వస్తువులు పేల్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Image Source: pti

ఎర్ర కోట మెట్రో స్టేషన్ గేట్ 1, 4 మూసివేశారు. ఈ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు

Image Source: pti

ఈ దాడికి బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Image Source: pti