ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఓ విమాన ప్రమాదంలో మరణించారు.

Published by: Shankar Dukanam
Image Source: PTI

ముంబై నుంచి బారామతికి వెళ్తుంటే జనవరి 28న ఈ ప్రమాదం జరిగింది. అజిత్ పవార్ సహా 5 మంది మరణించారు.

Published by: Shankar Dukanam
Image Source: PTI

జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ ముంబై నుండి ప్రైవేట్ విమానంలో బారామతికి బయలుదేరారు.

Published by: Shankar Dukanam
Image Source: PTI

ఆ తరువాత ల్యాండింగ్ అవ్వాల్సిన సమయంలో విమానం బారామతిలో క్రాష్ అయింది. వెంటనే ఇంధన ట్యాంక్ పేలిపోయింది.

Published by: Shankar Dukanam
Image Source: PTI

డీజీసీఏ సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో అజిత్ పవార్, ఇద్దరు పైలట్లు, ఇద్దరు సిబ్బంది మరణించారు.

Published by: Shankar Dukanam
Image Source: PTI

బారామతి దగ్గర ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఈ విషాదం జరిగింది

Published by: Shankar Dukanam
Image Source: PTI

విమానం ముంబై నుండి బయలుదేరిన దాదాపు ఒక గంట తర్వాత కూలిపోగా, విమానంలో మంటలు చెలరేగాయి.

Published by: Shankar Dukanam
Image Source: abplive

ఘటనా స్థలంలో క్రాష్ అయిన విమానం శిథిలాల వద్ద వీరి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published by: Shankar Dukanam
Image Source: abplive

అజిత్ పవార్‌ను చేతి వాచీ ద్వారా గుర్తించారు. గత 40 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Published by: Shankar Dukanam
Image Source: PTI

అజిత్ పవార్ మరణంపై దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం ప్రకటించారు.

Published by: Shankar Dukanam
Image Source: abplive