అమ్మాయిల జట్టు అదరగొట్టింది! చరిత్రలో కనీవినీ ఎరగని ఫీట్‌ సాధించింది.

ఏడోసారి మహిళల ఆసియాకప్‌ టోర్నీ విజేతగా ఆవిర్భవించింది.

షైలెట్‌ వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించింది.

66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 2 వికెట్లు నష్టపోయి ఛేదించింది.

8.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది.

స్మృతి మంధాన (51; 25 బంతుల్లో 6x4, 3x6) అజేయ హాఫ్‌ సెంచరీ సాధించింది.

ఇనోకా రణవీర (18*; 22 బంతుల్లో 2x4) లంకలో టాప్‌ స్కోరర్‌.

రేణుకా సింగ్‌ (3/5), రాజేశ్వరీ గైక్వాడ్‌ (2/16), స్నేహ్‌ రాణా (2/13) బంతితో చుక్కలు చూపించారు.

హర్మన్ ప్రీత్ ఎక్కువ టీ20లు ఆడిన అమ్మాయిగా రికార్డు సృష్టించింది.

దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించింది.