కుర్రాళ్ల టీమ్‌ఇండియా సఫారీలపై 2-1తో వన్డే సిరీస్‌ను పట్టేశారు. ఆఖరి వన్డేలో ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది. సఫారీలు నిర్దేశించిన 100 టార్గెట్ ను ఈజీగా ఛేదించారు. 3 వికెట్లు నష్టపోయి 19.1 ఓవర్లకే విజయం సాధించారు. శుభమ్‌న్ గిల్ (49; 57 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ (34; 42 బంతుల్లో 4x4) ప్రోటీస్‌లో టాప్ స్కోరర్. కుల్‌దీప్ 4 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, సుందర్, షాబాజ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. టార్గెట్ తక్కువే కావడంతో టీమ్ఇండియా ప్రెజర్ తీసుకోలేదు. కుల్ దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు.