ఆసియా కప్ 2023లో భారత్, పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (87: 90 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇషాన్ కిషన్ (82: 81 బంతుల్లో) కూడా బాగా ఆడాడు.
వీరి తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా (16) టాప్ స్కోరర్.
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన బ్యాటింగ్ ఎంత ఘోరంగా సాగిందో.
పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
నసీం షా, హరీస్ రౌఫ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి.
కానీ ఇన్నింగ్స్ బ్రేక్ నుంచి మైదానంలో వర్షం ప్రారంభం అయింది.
అది ఎంతకీ ఆగకపోవడంతో మ్యాచ్ నిలిపివేయక తప్పలేదు.