ఇలియానా 1987లో ముంబైలో జన్మించింది. పెరిగింది మాత్రం గోవాలోనే. ఇలియానా సినిమాల్లోకి రాకముందే కొన్ని వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. 2005లో దేవదాసు సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది. తెలుగులో తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్‌కి చేరిన హీరోయిన్ ఇలియానా. టాప్‌లో ఉన్నపుడే సినిమాలు మానేసి బాయ్ ఫ్రెండ్‌తో విదేశాలకు చెక్కేసింది ఇల్లీ. బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చేసింది. బ్రేక్ తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటోని’తో రీ ఎంట్రీ ఇచ్చినా లక్ కలిసి రాలేదు. తాజాగా ‘ఉఊ’ అనే హిందీ సాంగ్‌తో ఇలియానా యూట్యూబ్‌లో ట్రెండవ్వుతోంది. ఈ పాట షూటింగ్‌లో ఇలియానా ఇలా క్యూట్‌గా డ్యాన్స్ చేసి ఫిదా చేసింది. Images and Videos Credit: Ileana D'Cruz/Instagram and Hitz Music