బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి ఇటీవలే బాగా ట్రోలింగ్‌కు గురయింది.



కొంచెం లావుగా కనిపించడంతో ‘నువ్వు ప్రెగ్నెంట్‌లా ఉన్నావు’ అని కామెంట్లు చేస్తున్నారు.

అయితే కొంతమంది తనకు సపోర్ట్‌గా కూడా నిలబడ్డారు.

తను బరువునే కాదు, ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంచుకుందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

బరువు తగ్గడం, పెరగడం అనేది సాధారణం అని, దానికి ట్రోల్ చేయకూడదని కొందరు అంటున్నారు.

గతేడాది హ్యుమా ఖురేషి ‘డబుల్ ఎక్స్ఎల్’ అనే సినిమాలో నటించింది.

ఆ సినిమా కూడా బాడీ షేమింగ్ నేపథ్యంలోనే తెరకెక్కింది.

ఇక సినిమాల విషయానికి వస్తే ‘మోనికా, ఓ మై డార్లింగ్’తో హ్యూమా ఓటీటీ హిట్ కొట్టింది.

గతేడాది అజిత్ ‘వలిమై’ సినిమాలో కూడా హ్యూమా కనిపించింది.

ప్రస్తుతం తన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.