మే 8 ఆదివారం రాశిఫలాలు: ఈ రాశివారి అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది
మేషం: దంపతులు సంతోషంగా ఉంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఈరోజు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.అదృష్టం కలిసొస్తుంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. కెరీర్‌లో సానుకూల మార్పులు ఉంటాయి. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి రావడం కష్టమే. ముందుగా చేయాలని ప్లాన్ చేసుకున్న పనులు సకాలంలో పూర్తిచేయగలుగుతారు.
వృషభం: మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్లాన్స్ వేసుకోవచ్చు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది.పెద్దల నుంచి ఆస్తి కలిసొస్తుంది.
మిథునం: ఈ రోజు సన్నిహితులతో వాగ్వాదం జరగొచ్చు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. రాజకీయ వ్యక్తులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి.
కర్కాటకం: ఈ రాశివారి కోర్కెలు నెరవేరతాయి. నిర్మాణ పనులకు సంబంధించిన ఈ రోజు చాలా మంచిది. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. అనవసర వాదనల్లో సమయాన్ని వృథా చేయకండి.
సింహం: జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత చర్చలు జరపొద్దు. పరస్పర సంబంధాలు బలపడతాయి. కొత్త భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
కన్య: ఈ రోజు మీరు ఆరోగ్యం విషయంలో ఇబ్బందుల్లో పడతారు. ముఖ్యమైన ప్రాజెక్ట్ పనిలో పాల్గొంటారు. వ్యాపారంలో డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. సామాజిక జీవితంలో మీ కార్యాచరణ పెరుగుతుంది.
తులా: ఈ రోజు మీరు కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. సాంకేతిక పనులపై ఆసక్తి చూపుతారు. అదృష్టం కలిసొస్తుంది. ప్రేమ వ్యవహారాల గురించి మీరు భావోద్వేగానికి లోనవుతారు.రిస్క్ తీసుకోవద్దు. భాగస్వామ్య వ్వాపారం కలిసొస్తుంది.
వృశ్చికం: స్నేహితుడి నుంచి సహాయం అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. జీవిత భాగస్వామితో పాత సంతోషకరమైన సంఘటనల గురించి చర్చిస్తారు. మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తుల గౌరవం పెరుగుతుంది.
ధనుస్సు: జీవిత భాగస్వామితో ఓ విషయంలో వాదన ఉంటుంది. మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వివాదం పెరుగుతుంది. నిరుపేదలకు సహాయం చేస్తారు. దాన ధర్మాల పట్ల ఆసక్తి ఉంటుంది. తెలియని వ్యక్తులపై ఎక్కువగా ఆధారపడవద్దు.
మకరం: వ్యాపారంలో లాభం ఉంటుంది. వేరేవారి ఆలోచనలపై ఆధారపడి నిర్ణయం తీసుకోవద్దు.తలపెట్టిన పనులు సులభంగా పూర్తిచేస్తారు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు.జీవిత భాగస్వామితో గొడవ పెట్టుకోవద్దు.
కుంభం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. బాధ్యతలు నిర్వర్తించాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కార్యాలయంలో పెద్ద మార్పులు చేయవద్దు. పనివిషయంలో అంకితభావం ఉంటుంది. పాదాల నొప్పితో ఇబ్బంది పడతారు.
మీనం: కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తారు. వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు పొందుతారు. కార్యాలయంలో బాధ్యతలు సకాలంలో పూర్తిచేస్తారు. సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. మీ సన్నిహితులతో సత్సంబంధాలు కొనసాగించండి.