ABP Desam


డిసెంబరు 3 శనివారం రాశిఫలాలు


ABP Desam


మేష రాశి
డబ్బు సంపాదనపై అత్యంత ఆసక్తి చూపిస్తారు...పూర్తిగా అందులోనే నిమగ్నమై ఉంటారు. మీ ముఖ్యమైన బాధ్యతలను నెరవేర్చడం మరిచిపోవద్దు. బిజీ కారణంగా ముఖ్యమైన పనులు ఈరోజు కూడా పూర్తికావు. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది.


ABP Desam


వృషభ రాశి
మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోండి. కార్యాలయంలో ఉద్యోగులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. జీవనోపాధికి కొత్త వనరులు ఏర్పడతాయి. మీరు పెద్ద ప్రాజెక్ట్ పొందవచ్చు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.


ABP Desam


మిథున రాశి
కొత్త వ్యాపార ఒప్పందాలు జరుగుతాయి. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.


ABP Desam


కర్కాటక రాశి
ఆత్మవిశ్వాసానికి అనుకూలమైన శక్తి తోడవుతుంది. భాగస్వామ్య వ్యాపారం లాభిస్తుంది. మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. మంచిగా ఆలోచించండి. వృద్ధుల ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. మీ కలలను సాకారం చేసుకునే సమయం ఆసన్నమైంది, అంకితభావంతో పని చేయండి


ABP Desam


సింహ రాశి
మీ మనస్సు దేనిగురించైనా ఆందోళన చెందుతుంటే దానిని పూర్తిగా పరిశీలించి, మీ విశ్వసనీయ వ్యక్తులతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శత్రువులు చురుకుగా ఉంటారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.గతంలో పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి.


ABP Desam


కన్యా రాశి
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో మీ బాధ్యతను అర్థం చేసుకోండి. కోపంతో ఏమీ సాధించలేరు. పెద్దల అనుభవం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ మనస్సులో మాటని, వ్యాపార ప్రణాళికను అందరికీ చెప్పకండి..నష్టపోతారు.


ABP Desam


తులా రాశి
ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. అపరిచితుడిని నమ్మవద్దు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. సంతాన సౌభాగ్యం కలుగుతుంది.


ABP Desam


వృశ్చిక రాశి
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ధీమాగా వ్యవహరిస్తే మీతోపాటూ మిమ్మల్ని నమ్ముకున్న వారు కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారంలో పురోభివృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది.


ABP Desam


ధనుస్సు రాశి
మీకు కలిసొచ్చే సమయం ఇది. శ్రమని నమ్ముకుంటేనే ఫలితం సాధిస్తారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.


ABP Desam


మకర రాశి
వివాహ చర్చలలో విజయం ఉంటుంది. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. చాలా రోజులుగా మీ మనసులో ఏదో సందిగ్ధత ఉంది. కొన్ని విషయాల్లో అబద్ధం చెబితే అనవసరంగా చిక్కుకుపోతారు. ఆర్థకి పరిస్థితి బావుంటుంది.


ABP Desam


కుంభ రాశి
అనుకున్న పనులు వాయిదా వేయొద్దు. అడ్డంకులున్నా అనుకున్న సమయానికి పూర్తిచేయండి. తొందరపాటు నిర్ణయాలు తప్పని రుజువు చేస్తుంది. వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి రుణం తీసుకోవలసి ఉంటుంది. మంచి వ్యక్తుల సాంగత్యం పొందుతారు.


ABP Desam


మీన రాశి
మెరుగైన విజయం కోసం కార్యాచరణ ప్రణాళికలో మార్పులు చేయండి. మీ తీరు మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవు. ఇంట్లో తోడబుట్టినవారి వివాహం ఆలస్యం అవుతుంది. పత్తి నూనె , ఇనుము వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు నష్టపోతారు