మేషం బులియన్ వ్యాపారులు ఈ రోజు కొనుగోలు మరియు అమ్మకాల వల్ల లాభపడతారు. తలపెట్టిన పని పూర్తికావడంతో మనసు ఆనందంగా ఉంటుంది. యువత తమ కెరీర్ విషయంలో యాక్టివ్‌గా ఉంటారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ట్రై చేయండి.
వృషభం ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ పని లేకపోవడం వల్ల మానసికంగా కలత చెందుతారు. టెన్షన్ పెరుగుతుంది. మీపై తప్పుడు ఆరోపణలు రావొచ్చు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ ఉండదు. మీ పనిని వేరొకరిపై రుద్దొద్దు.ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్త.
మిథునం పెట్టుబడి ద్వారా లాభం వస్తుంది. తెలియని వ్యక్తుల వల్ల మీ పని దెబ్బతింటుంది. అకస్మాత్తుగా ఎవరితోనైనా వివాదం రావచ్చు. ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది. కుటుంబంతో సమయం గడుపుతారు. కుటుంబ సభ్యులు మీ నుంచి సలహాలు తీసుకుంటారు.
కర్కాటకం ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. బంధువుల సలహాతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. జీతాల పెంపుపై అధికారులతో చర్చిస్తారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలమైన రోజు.
సింహం ఈ రోజు స్నేహితుడికి సహాయం చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. పొట్టకు సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు.
కన్యా ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీరు కొంత గందరగోళంలో ఉంటారు. జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. విలువైన వస్తువులను రక్షించండి. తెలియని వ్యక్తులను నమ్మవద్దు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయాల్సిందే.
తులా భవిష్యత్తు భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. దానధర్మాలు చేస్తారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తారు. విహారయాత్రకు వెళ్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు.ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
వృశ్చికం ఈ రోజు మీరు ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతారు. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. అపరిచితుడిని సులభంగా నమ్మవద్దు. ఆఫీసులో మీకు పెద్ద బాధ్యత ఉంటుంది. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు.
ధనుస్సు పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద నిర్ణయం తీసుకుంటారు. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. చేతికి అందాల్సిన మొత్తం సరైన సమయానికి అందదు. కొత్త ఆదాయ వనరులు లాభిస్తాయి. ఒకరి మాటల వల్ల మీరు గందరగోళానికి గురవుతారు.
మకరం ఈ రోజు బాగానే ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించండి. సోమరితనం విడిచిపెట్టండి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. పిల్లల పురోగతిని చూసి ఉత్సాహంగా ఉంటారు.
కుంభం మీ గౌరవం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. షాపింగ్‌పై చాలా ఆసక్తి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. బంధువులు మిమ్మల్ని అభినందిస్తారు. వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటాయి. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది.
మీనం మీరు కొత్త ఉద్యోగ బాధ్యతలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీపై ప్రతికూలత పెరుగుతుంది.ప్రత్యర్థులు హాని చేయవచ్చు. రచనలతో సంబంధం ఉన్న వ్యక్తులు విజయం సాధిస్తారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ మార్పును పరిశీలిస్తారు.