ఈ రాశివారు ఏదో అయోమయ స్థితిలో ఉంటారు. ( 26-03-2023 రాశిఫలాలు)
మేష రాశి ఈ రోజు మీ ప్రత్యర్థులు మీ ప్రతిష్టను పాడుచేయడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త. ముఖ్యమైన లేదా బాధ్యతాయుతమైన పనులు చేయాల్సి వస్తే ఈ రోజు వాయిదా వేయడమే మంచిది. కుటుంబ జీవితం బావుంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.
వృషభ రాశి ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మనసులో సంతోషం ఉంటుంది. అందరితోనూ ఇట్టే కలసిపోతారు. తలపెట్టిన పనులకు సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది..వారిని జాగ్రత్తగా చూసుకోండి.
మిధున రాశి ఈ రోజు ఈ రాశివారికి ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు. ఈ రాశి స్త్రీలకు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. పిల్లల్ని సంతోషంగా ఉంచేందుకు కొన్ని ప్లాన్స్ చేస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు ఈ రోజు పూర్తవుతాయి.
కర్కాటక రాశి ఈ రోజు ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. కుటుంబ జీవితం బావుంటుంది. రోజంతా చురుకుగా ఉంటారు. ఉద్యోగుల పని సామర్థ్యం పెరుగుతుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. కోపంతో ఏ పనీ చేయకూడదు.
సింహ రాశి ఈ రోజు మీకు కొద్దిగా బలహీనంగా ఉండొవచ్చు. ఆరోగ్యం దెబ్బతిట్టుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. తలపెట్టిన పనికి సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది.
కన్యా రాశి ఈ రోజంతా మీరు ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు. ఓ పెద్ద కంపెనీ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. తల్లిదండ్రుల ఆశీస్సులు మీపై ఉంటాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.
తులా రాశి ఈ రోజు ఈ రాశివారు కొత్త బాధ్యతలు పొందుతారు. అంకితభావంతో కష్టడి పనిచేస్తే..ఉన్నతాధికారుల కృపకు పాత్రులవుతారు. ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించండి..అంతా శుభమే జరుగుతుంది. సానుకూల ఆలోచనలే కొనసాగించండి..ప్రతికూల ఆలోచనలకు తావివ్వవద్దు.
వృశ్చిక రాశి ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన పనిలో స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. ఈ రాశికి చెందిన ఆర్ట్స్ విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఇప్పటికే ఇచ్చిన ఏదైనా పోటీ పరీక్షలు రాసి ఉంటే విజయం సాధిస్తారు. ఆర్థిక రంగంలో స్థిరత్వం ఉంటుంది.
ధనుస్సు రాశి ఈ రోజు మీకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మీరు ఏదో ఒక అయోమయ స్థితిలో ఉంటారు. మీరు పనికి సంబంధించి మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబంలో సమస్యలు రావొచ్చు.
మకర రాశి ఈ రోజు మీ ప్రత్యర్థులు బహిరంగంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. చాలా పని ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ రోజు మీరు మీ భావోద్వేగ స్థితి గురించి చాలా ఆందోళన చెందుతారు.
కుంభ రాశి ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది.మీ తెలివితేటలను ఉపయోగించడం ద్వారా మీరు అడ్డంకులను అధిగమిస్తారు. ఖర్చులను ఎలా నియంత్రించుకోవాలో మీరు నేర్చుకోవాలి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది.
మీన రాశి ఈ రోజు మీరు ఏ పనిని పూర్తి చేయాలనుకుంటున్నారో, ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగులు పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.