ఈ రాశులవారు శత్రువులను జయిస్తారు



మేష రాశి
ఈ రాశి విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారు. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. పెద్దల మార్గదర్శకత్వం పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది.



వృషభ రాశి
మీ మాటల్ని నియంత్రించాలి. ఒకరి ప్రవర్తన మీపై ఒత్తిడిని కలిగిస్తుంది. పాత వ్యాధి తిరిగబెట్టే అవకాశం ఉంది జాగ్రత్త. విచారకరమైన వార్తలు వినాల్సి రావొచ్చు. కాస్త ఓపికగా వ్యవహరించాలి..ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.



మిథున రాశి
శత్రువులకు మీచేతిలో ఓటమి తప్పదు. వివాదాలను ప్రోత్సహించవద్దు. అనుకున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఆదాయ వనరులలో పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారం బాగా సాగుతుంది.



కర్కాటక రాశి
ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శారీరక ఇబ్బంది, మానసిక ఒత్తిడి ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దు. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది.



సింహ రాశి
ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధనంకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభం ఉంటుంది. చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. పెద్ద సమస్య నుంచి బయటపడతారు.



కన్యా రాశి
అనవసర ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేయాల్సి రావొచ్చు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. రిస్క్ తీసుకోవద్దు. అనకున్న పనులు ఆలస్యం అవుతాయి. ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చు



తులా రాశి
ఈ రాశివారు అప్పుల నుంచి బయటపడతారు. వ్యాపార కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొత్త ఆదాయవనరులు లాభిస్తాయి. కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. విలువైన వస్తువులు, ఆరోగ్యం జాగ్రత్త.



వృశ్చిక రాశి
ఈ రాశివారికి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. పనితీరులో మెరుగుదల ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. భాగస్వాముల సహకారం ఉంటుంది. వ్యాపార ఒప్పందాలపై నమ్మకం పెరుగుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.



ధనుస్సు రాశి
ఏ తప్పులను సమర్ధించవద్దు.వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండొచ్చు. లాభదాయకమైన అవకాశాలు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యులనుంచి సహకారం అందుతుంది.



మకర రాశి
ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. వివాదాల కారణంగా ఉద్రిక్తత ఉంటుంది. కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంది. వాహన వినియోగంలో నిర్లక్ష్యం చేయవద్దు. తెలియని అడ్డంకి ఉండవచ్చు. టెన్షన్ పెరుగుతుంది.



కుంభ రాశి
ఇంట్లో అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపారం బాగా సాగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.



మీన రాశి
ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భూమి, భవనాలు, దుకాణం, కర్మాగారాలు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఉపాధిలో పెరగుదల ఉంటుంది.అపరిచితులను నమ్మొద్దు. సోమరితనం ఉండదు.