తక్కువ చక్కెర ఆహారాలు ఇవిగో మధుమేహులకు ఏ ఆహారాలు తినాలన్న విషయంలో క్లారిటీ తక్కువగా ఉంటుంది. వారు చక్కెర అధికంగా ఉన్న ఆహారం తింటే సమస్యలు అధికమవుతాయి. అందుకే వారికి ఏ ఆహారాల్లో చక్కెర శాతం తక్కువ ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ఆహారాలు ఇక్కడ మేమిచ్చాం. వీటిని మధుమేహులు హ్యాపీగా తినొచ్చు. వందగ్రాముల క్యారెట్లలో 4.7 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి ఒకటి లేదా రెండు క్యారెట్లు తినడం వల్ల శరీరంలో చేరే చక్కెర చాలా తక్కువ. వేసవి కాలంలో డయాబెటిస్ రోగులు హ్యాపీగా కీరాదోసలు తినొచ్చు. వీటిలో చక్కెర, కార్బోహైడ్రేట్లు, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. ఫైబర్ అధికంగా ఉంటుంది. సాధారణ బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్ డయాబెటిక్ వారికి చాలా సురక్షితం. 100 గ్రాముల బ్రౌన్ రైస్లో కేవలం 0.9గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. సాధారణ పెరుగుతో పోలిస్తే గ్రీక్ యోగర్ట్‌లో చక్కెర, కొవ్వు రెండూ తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల గ్రీకు యోగర్ట్ లో 3.2 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. పుట్టగొడుగుల్లో చక్కెర తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. వందగ్రాములు తెల్ల పుట్టగొడుగులు తింటే కేవలం రెండు గ్రాముల చక్కెర మాత్రమే శరీరంలో చేరుతుంది.