తెలుగులో శోభన్ బాబు తరువాత ఆ రేంజ్ లో లేడీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో జగపతిబాబు. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. నటుడిగా సక్సెస్ అవ్వడానికి జగపతికి చాలా సమయం పట్టింది. 'జగన్నాటకం', 'పెద్దరికం' వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. 'గాయం' సినిమా నటుడిగా జగపతిబాబులో మరో కోణం చూపించింది. అతడి కెరీర్ లో 'శుభలగ్నం' సినిమా ఆడియన్స్ కు గుర్తుండిపోతుంది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే రెసొల్యూషన్ తీసుకున్నారు జగపతిబాబు. తన శరీరంలో వైటల్ ఆర్గాన్స్ ను డొనేట్ చేశారు. చనిపోయిన తరువాత తన శరీర అవయవాలు ఇతరులకు ఉపయోగపడాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. తన అభిమానులకు అవయవదానం చేయాలని పిలుపునిచ్చారు.