వాస్తు ప్రకారం పడక గదిని (Bed Room) నిర్మించుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపడమే కాదు మానసిక ప్రశాంతంతని ఇస్తుందంటారు వాస్తునిపుణులు.
పడక గదిని సాధ్యమైనంత వరకు ఈశాన్యం, ఆగ్నేయం దిక్కుల్లో నిర్మించుకోకూడదు. ఒకవేళ ఆ దిశల్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోవడం, మంచి సంబంధాలు కుదరకపోవడం, ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతాయి
బెడ్ రూమ్ ఎప్పుడూ నైరుతి దిక్కునే ఉండాలి. ఇటువైపున్న బెడ్ రూమ్ లో ఇంట్లో అందరికన్నా పెద్దవారుండాలి.
ఆగ్నేయ దిశలో పడక గది నిర్మించుకుంటే అనవసరమైన సమస్యలు వెంటాడుతాయి. నిద్రపట్టక పోవడం, ఇంట్లో ఆందోళనలు, భార్యభర్తల మధ్య మనస్పర్థలు లాంటి ఇబ్బందులు వస్తాయి.
చిన్నారులకైతే ఆగ్నేయ దిక్కులో ఉన్న పడక గది మంచి చేకూరుస్తుంది. సిగ్గు, బిడియం లాంటివి తొలిగి వారి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది.
పడకగది (BED Room)లో మంచాన్ని ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే ఆరోగ్య, మానసిక విషయాలపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది
పడకగది తలుపుకి, కిటికీకి ఎదురుగా మంచం ఉండకూడదు. వాస్తు పరంగా కాకపోయినా ఇలా ఉంటే వెలుగు ఎక్కువ రావడం వల్ల నిద్రకు భంగం (Disturbance) కలుగుతుంది
అద్దాన్ని కాని, డ్రెస్సింగ్ టేబుల్‌ని కాని మంచానికి తలవైపు కాని, కాళ్లవైపు కాని ఉంచకూడదు. నిద్రపోయే సమయంలో ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చి గదంతా తిరుగుతుందని చైనీయుల విశ్వాసం.
అద్దాన్ని కాని, డ్రెస్సింగ్ టేబుల్‌ని కాని మంచానికి తలవైపు కాని, కాళ్లవైపు కాని ఉంచకూడదు. నిద్రపోయే సమయంలో ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చి గదంతా తిరుగుతుందని చైనీయుల విశ్వాసం.