నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో నేటి నుంచి మరో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కువరనున్నాయి. అల్పపీడనం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో నేడు సైతం భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది గోదావరి ప్రవాహం క్రమంగా తగ్గుతోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం సమీక్షలో తెలిపారు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి. చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దుల్లో, కర్నూలు జిల్లాలోని కొన్ని చోట్ల నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది. తెలంగాణలో 5 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.