మూడు వారాలకు మించి తగ్గకుండా దగ్గు వస్తుంటే అది టీబీకి ప్రధాన లక్షణం కావచ్చు.

శ్వాస తీసుకునేటప్పుడు లేదా దగ్గేటప్పుడు ఛాతీలో విపరీతమైన నొప్పి కలగడం.

దగ్గినప్పుడు కఫంతో పాటు రక్తం పడటం టీబీ వ్యాధి ముదిరినదనడానికి సంకేతం.

ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా అకస్మాత్తుగా శరీర బరువు గణనీయంగా తగ్గిపోవడం.

Published by: Raja Sekhar Allu

ఆహారం పట్ల ఆసక్తి లేకపోవడం, తిన్నది అరగకపోవడం వంటి మార్పులు కనిపిస్తాయి.

ఆహారం పట్ల ఆసక్తి లేకపోవడం, తిన్నది అరగకపోవడం వంటి మార్పులు కనిపిస్తాయి.

Published by: Raja Sekhar Allu

రోజంతా బాగున్నా, ప్రతిరోజూ సాయంత్రం లేదా రాత్రి సమయంలో స్వల్పంగా జ్వరం రావడం.

చల్లని వాతావరణంలో కూడా రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం.

చిన్న పని చేసినా త్వరగా అలసిపోవడం, ఎప్పుడూ నీరసంగా అనిపించడం.

కొన్నిసార్లు టీబీ ఊపిరితిత్తులకే కాకుండా గ్రంథులకు సోకినప్పుడు మెడ కింద గడ్డలు లేదా వాపులు రావచ్చు.

పైన పేర్కొన్న లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.