మామిడి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వీటిని తినడం అస్సలు మంచిది కాదు.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిది,

Image Source: pexels

మామిడి పండు తింటే దాదాపు 130 నుండి 150 కేలరీలు శరీరానికి అందుతాయి. కాబట్టి బరువు తగ్గడానికి డైట్ పాటించే వారు మామిడి పండ్లను ఎంత తక్కువ తింటే అంత మంచిది.

Image Source: pexels

మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారి శరీరం అదనపు పొటాషియంను బయటకు పంపలేకపోతుంది.

Image Source: pexels

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ , గ్యాస్, ఎసిడిటీ , కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నవారికి మామిడి పండ్లు తింటే సమస్య మరింత తీవ్రమవుతుంది.

Image Source: pexels

మామిడి పండు శరీరంలో వేడిని పెంచుతుంది. ఒకవేళ ఇప్పటికే మోషన్స్ లేదా విరేచనాలతో బాధపడుతుంటే, మామిడి పండ్లు అస్సలు ముట్టకూడదు.

Image Source: pexels

ఆయిలీ స్కిన్ , మొటిమల సమస్యతో బాధపడేవారు మామిడి పండ్లను పరిమితంగానే తినాలి.

Image Source: pexels

యూరిక్ యాసిడ్ సమస్య లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారు మామిడి పండ్లను ఎక్కువగా తినకూడదు.

Image Source: pexels

కడుపులో అల్సర్లు లేదా తీవ్రమైన ఎసిడిటీ ఉన్నవారికి మామిడి పండ్లు తింటే గుండెల్లో మంట, పొట్టలో అసౌకర్యం పెరుగుతుంది.

Image Source: pexels

ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి మామిడి పండ్లు కొన్నిసార్లు అలర్జీని ప్రేరేపిస్తాయి.

Image Source: pexels