కిడ్నీ వ్యాధులు సాధారణంగా ముదిరే వరకు బయటపడవు,

Published by: Raja Sekhar Allu

రాత్రిపూట ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, మంటగా అనిపించడం కిడ్నీ సమస్యకు ప్రాథమిక సంకేతం.

మూత్రం పోసేటప్పుడు ఎక్కువగా నురుగు రావడం అంటే ప్రోటీన్ లీక్ అవుతున్నట్లు అర్థం.

కిడ్నీలు సోడియంను సరిగ్గా బయటకు పంపలేనప్పుడు శరీరంలో నీరు నిలిచిపోతుంది . దీనివల్ల వాపు కనిపిస్తుంది.

ఉదయం నిద్రలేవగానే కళ్ల చుట్టూ ఉబ్బినట్లుగా ఉండటం కిడ్నీలు ప్రోటీన్‌ను వడకట్టలేకపోతున్నాయని చెప్పడానికి ఒక సూచన.

బాధితులు ఎప్పుడూ నీరసంగా, శక్తి లేనట్లుగా అనిపిస్తుంటారు. ఏకాగ్రత దెబ్బతింటుంది.

చర్మం విపరీతంగా పొడిబారిపోవడం, దద్దుర్లు రావడం , నిరంతరం దురద పెట్టడం జరుగుతుంది.

తరచుగా వికారం, వాంతులు అయ్యే సూచనలు కనిపిస్తాయి. దీనివల్ల బరువు కూడా వేగంగా తగ్గుతారు.

కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు ఊపిరితిత్తుల్లో నీరు చేరడం , రక్తహీనత వల్ల కొద్ది దూరం నడిచినా ఆయాసం వస్తుంది.

కిడ్నీలు ఉండే చోట అంటే వెన్నుభాగంలో ఇరువైపులా లేదా ఒకవైపు విపరీతమైన నొప్పి రావడం.

పైన పేర్కొన్న లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావచ్చు. వీటిలో ఏవైనా మూడు-నాలుగు లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలి.